నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఫాతిమా మాత తిరునాళ్ళ మహోత్సవాలు వరంగల్ పీఠాధిపతులు మహా ఘన డా..ఉడుముల బాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహంచనున్నారు. సోమవారం కాజీపేట మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడుతూ…12 జిల్లాల విశ్వాసుల తిరునాళ్ళ మహోత్సవం నేటి నుంచి 11,12,13 వ తేదీలలో జరుగనున్న వేడుకలకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో దంపతుల ఆశీర్వచనాలు, దివ్య పూజాబలి, మహా రథం ప్రదక్షణ, ఫాతిమా ప్రధాన తోరణం ప్రారంభోత్సవం, పలు పూజ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా నగర్ విచారణ గురువులు ఫా.. కాసు మర్రెడ్డి, పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫా..తాటికొండ జోసఫ్, ఏకశిలా నగర్ విచారణ గురువులు ఫా..పొలిమేర సురేష్ వడ్డేపల్లి విచారణ గురువులు ఫా.. గంగారపు నవీన్, ఫా.. అనుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.



