Friday, March 13, 2026

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కు తోటి విద్యార్థుల సన్మానం..!

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిమండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ హై స్కూల్లో 1987 – 88సం, 10వ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు అందరూ కలిసి ఇటీవల రుద్రంగి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన తోటి పూర్వ విద్యార్థి చెలుకల తిరుపతి కి చందుర్తి, రుద్రంగి రెండు మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమతో పాటు చదువుకున్న తోటి పూర్వ విద్యార్థి రుద్రంగి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమింపబడిన చేలుకల తిరుపతి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే శాలువాతో ఘనంగా సన్మానించామని తెలిపారు. మాతోపాటు చదువుకున్న చిన్ననాటి మిత్రుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం ఎంతో గర్వకారణమని రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు రావాలని తోటి స్నేహితులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్ర బృందం వై. శ్రీవాణి, నల్ల నాగిరెడ్డి, కే. నాగేశ్వరరావు, డి. శంకర్, ఎం. చక్రవర్తి, టీ. చంద్రశేఖర్, ఏ. రవిందర్, పి. శ్రీనివాస్, టీ. గంగాధర్ ఎస్. రమేష్, పి. రవి, పి. అశోక్, బి. గంగాధర్, డి. రవి, కె. ఆంజనేయులు, ఎస్. లక్ష్మిరాజo, కె. శంకర్, ఎం. కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News