- మరిపల్లి గూడెం గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వెలుగులోకి
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన కాజీపేట ఏసిపి తిరుమల్

నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామం శివారులో ఎలిమి ఐలయ్య వ్యవసాయ భూమి వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం అవశేషాలతో కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పిమ్మట మృతదేహం ఆనవాళ్లు పుర్రె, నల్లనిజుట్టు, ఎముకలు, లేతపసుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు జాకెట్, నీలం రంగు లంగా ఆనవాళ్ళు లభించాయి. ఇట్టి సమాచారం పై పంచాయతీ సెక్రటరీ మరుపాక శరత్ దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, సంఘటన స్థలాన్ని కాజీపేట ఏసిపి తిరుమల్ సందర్శించి తగు సూచనలు ఇవ్వటం జరిగిందని సీఐఈ హరికృష్ణ తెలిపారు.

