Thursday, March 12, 2026

ఫెర్టిలైజర్ యజమానులు గోదాములను పట్టణం బయట ఏర్పాటు చేసుకోవాలి

  • బూడిద గణేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

నేటి సాక్షి,మంథని(పెయ్యల రమేష్) : మంథని పట్టణంలో మంథని అంబేద్కర్ చౌరస్తా లో ఎరువుల బస్తాల లారీ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ సంఘటన స్థలాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ… మంథని నడి ఒడ్డున గల అంబేద్కర్ చౌరస్తాలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని అన్నారు.పగటిపూట సమయంలో భారీ వాహనాలను పట్టణం లోపలికి ప్రవేశాలు కల్పించ వద్దని డిమాండ్ చేశారు.ఫెర్టిలైజర్ షాప్ యజమానులు గోదాములను పట్టణం బయట ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గతంలో మున్సిపల్ అధికారులు నాలా పైకప్పు నిర్మాణాలను నాసిరకంగా చేపట్టడం వల్ల పైకప్పు నిర్మాణాలు కూలడంతో లారీ టైర్లు డ్రైనేజీలో ఇరుక్కుపోయాయని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం కట్టు దిట్టమని చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News