Sunday, March 22, 2026

సిపిఎస్ రద్దు కోసం యుద్ధభేరి

నేటిసాక్షి, రాయికల్ (సింగిడి కార్తీక్) : సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 2 న హైదరాబాద్ ధర్నా చౌక్ లో యుద్ధభేరి నిర్వహిస్తున్నమని టి ఎస్ సీపీఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరి మహేష్ అన్నారు. మండల పరిధిలోని రాయికల్, మైతాపూర్, తాట్లావాయి, ఆలూరు లలో శుక్రవారం ధర్నా గోడ పత్రికను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సర్వ సతీష్, జిల్లా కోశాధికారి గొల్లపెల్లి మహేష్, భోగ శ్రీనివాస్, మండల నాయకులు వేల్పుల గంగారాజం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News