- మారుపూరి తరీష్ బాబు (రాకేష్ చౌదరి) మృతి బాధాకరం
- మృతదేహంపై పార్టీ జెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించిన పులివర్తి నాని కుటుంబం
- ఘటన జరిగినప్పటి నుంచి దాహనక్రియలు పూర్తి అయ్యే వరకు అన్నీ తానై
- పాడే మోసి కార్యకర్త రుణం తీర్చుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని
- కుటుంబ సభ్యులకు అండగా నేనున్నానని భరోసా ఇచ్చిన పులివర్తి నాని

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): చంద్రగిరి ఏనుగుల దాడిలో మృతిచెందిన చంద్రగిరి మండలం నారావారి పల్లి సర్పంచ్ మారుపూరి తరిష్ బాబు (రాకేష్ చౌదరి) మృతదేహం స్వగ్రామం మామిడి మాను గడ్డకు చేరుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం అత్యంత సన్నిహితుడు శనివారం అర్ధరాత్రి ఘటన జరిగినప్పటినుండి మృతదేహాన్ని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి అనంతరం స్వగ్రామానికి తీసుకువచ్చారు. రాకేష్ చౌదరి పార్థివదేహం పై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబం నివాళులు అర్పించారు . స్వగ్రామంలో అంత్యక్రియలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గరుండి జరిపించారు. అంత్యక్రియలలో పాడే మోసి కార్యకర్త రుణం తీర్చుకున్నారు. రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులకు నేనున్నానని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు.రాకేష్ అంత్యక్రియలకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు




