Saturday, March 21, 2026

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఆర్థిక సహయం

  • తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో నగదు అందజేత

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పుల్ల నాగరాజు అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో తీన్మార్ మల్లన్న టీం సోషల్ మీడియా ఇంచార్జి కొలుగూరి ప్రవీణ్ కుమార్,తీన్మార్ మల్లన్న కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వీడియో కాల్ ద్వారా పుల్ల నాగరాజు ను పరామర్శించిన తీన్మార్ మల్లన్న 10000 రూపాయల ఆర్థిక సహాయం ను తన టీం సభ్యుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సోషల్ మీడియా ఇన్చార్జి కొలుగూరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తీన్మార్ మల్లన్న ఆపన్న హస్తం అందజేయడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. భాడితుడు పుల్ల నాగరాజు తనకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News