Monday, March 16, 2026

గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ, 10వేల ఆర్థిక సాయం

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
  • దాతలు తోచిన చెయ్యాలని మహిళా అభ్యర్థన

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండలం పసునూరు తండా నిరుపేద కుటుంబానికి చెందిన బాదావత్ రాజు, ఇతనికి భార్య, 2సంవత్సరాల కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా పొట్టకూటి కోసం లేబర్ పని నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లి వస్తుంటాడు. తిరిగి గల్ఫ్ వెళ్లనున్న దృశ్య బాల్య మిత్రులను కలవడానికి మిత్రుని ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో విధి వక్రించి మేడిపెల్లి మండలం కొండాపూర్ వద్ద టిప్పర్ లారీ ఢీ కొనడంతో వెంటనే 108వాహనంలో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య నాగలక్ష్మి రోదిస్తూ మాకు పెద్దదిక్కు కోల్పోయాము. మానవతా దృక్పథంతో చిన్నబాబు భవిష్యత్తు గురించి మీకు తోచినసాయం చేయండి అని కోరడంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడంతో దాతలు స్పందించి 10వేల రూపాయలు విరాళాల రూపంలో అందించడంతో శనివారం రోజున పసునూరు వెళ్లి భాదితుని భార్య నాగలక్ష్మికి అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు తోట రాజు, పొలాస రాజేందర్, వి.బుచ్యనాయక్, బాదావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News