నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన ముత్యం ధర్మయ్య గౌడ్ ఇటీవల తాడిచెట్టు పైనుండి మరణించగా ముత్యం రాజశేఖర్ తో చదువుకున్న మిత్ర బృందం 50 కేజీల బియ్యం, 15 లీటర్ల ఆయిల్ క్యాన్ మరియు మూడు వేల రూపాయల నగదు వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రదీప్ అనిల్ కర్ణాకర్, రాజశేఖర్, నరేష్ మల్లేష్ రాకేష్ రాజు శ్రీకాంత్ శేఖర్ నరేష్ పరశురాం శ్రీను అంజి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.




