- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
శనివారం మధ్యాహ్నం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోజుకో కార్యక్రమం చొప్పున షెడ్యూల్ రూపొందించాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలకు బ్లాక్ స్పాట్ గా గుర్తించిన 49 ప్రదేశాల్లో సైన్ బోర్డులు పెట్టడం, స్పీడ్ బ్రేకర్ అమర్చడం తదితర చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు.

పట్టణంలో రోడ్డు మధ్యలో ప్రమాదకర టర్నింగ్ పాయింట్ లను తొలగించాలని ఆదేశించారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు సిబ్బందిని పెంచి నిబంధనలు పాటించని హెల్మెట్ ధరించక పోవడం, పరిమితికి మించి ప్రయాణించడం, అడ్డదిడ్డంగా వాహనాలు నడపటం, పార్కింగ్ లేని చోట పార్కింగ్ చేయడం వారిపై జరిమానాలు విధించాలని పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్, ఎస్పీ కార్యాలయం వచ్చే వారు హెల్మెట్ లేకుండా వస్తె జరిమానాలు విధించాలని సూచించారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అది కార్యరూపంలో ఉండాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఆర్టీవో మానస, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, రోడ్లు భవనాల డి. ఈ సితారామ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

