నేటి సాక్షి, నరసింహుల పేట రిపోర్టర్ భూక్యా రవి : నర్సింహుళపేట మండలం రామన్న గూడెం గ్రామానికి చెందిన దుండి ఉప్పలయ్య, వయస్సు 45, భార్య మంజుల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాపల వేటకు వెంకన్న చెరువు సమీపములో గుంటలో చాపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ గురై మత్స్యకారుడు మృతి చెందాడు. స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై సురేష్ సమాచారాన్ని తెలుసుకొని విచారించి పోస్టుమార్టం నిమిత్తం మత్స్యకారుని మృతదేహాన్ని మహబూబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. తన భర్త చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ గురై మృతి చెందడాన్ని తన భార్యకు చెప్పడంతో బోరున విలపించారు. ఊరి స్థానికులు తమ ఆర్థిక పరిస్థితిని చూసి చెలించి ప్రభుత్వం మత్స్యకారునికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగింది.





