Wednesday, March 11, 2026

1359 రోజులుగా పేదలకు అన్నదానం

  • మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : దాతల సహకారంతో 1359 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ వద్ద రాజన్న, భీమేశ్వర ఆలయంవద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా కుమారుని పుట్టిన రోజు సందర్భంగా కారింగుల రాజేందర్ విజయలక్ష్మి దంపతులు,

సందరగిరి సిద్ధార్థ మనీషా దంపతులు మరియూ కుటుంబ సభ్యులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని
నిత్యాన్నదాన కార్యక్రమా నికి సహకారం అందించా లనుకునే అన్నదాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మహేష్ కోరారు. శనివారం అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, వొడ్యాల వేణు, సందరగిరి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News