- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ: ( కొక్కుల వంశీ ): మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1399 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు సభ్యులు మధు మహేష్ తెలిపారు. గురువారం అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలను కునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించా లని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, వొడ్యాల వేణు, ప్రతాప నటరాజు, చల్లా సత్తయ్య, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





