- జన్మదిన వేడుకల సందర్భంగా మొక్కలు నాటిన కొండాపురం బిఆర్ఎస్ నాయకులు నక్క రవి గాజుల కృష్ణ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని కొండాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కొండాపురం నాయకులు గాజుల కృష్ణ, నక్క రవి, ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కృష్ణ నక్క రవి మాట్లాడుతూ.. ఉద్యమ కాలమైన పరిపాలన ప్రస్తానం మైన.. నిత్యం తెలంగాణ నే స్వాసించిన నేత కెసిఆర్ అన్నారు రాష్ట్రం కోసం ఢిల్లీ గద్దెని ఎదిరించి ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసిన దీశాలి! ఒక జాతిని తట్టి లేపి కోటి గొంతుకలను ఏకం చేసిన ఘనత కెసిఆర్ ది సబ్బండ వర్గాలను జట్టు కట్టి దాస్య సుంకరాలు తెంపి విజయ బావుట ఎగరేసిండు కేసీఆర్ అని రవి తెలిపారు ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహాన్యాయకుడు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో రంగసామి, అంజి, రాము, రంగస్వామి, కృష్ణ, , తదితరులు పాల్గొన్నారు





