Saturday, March 21, 2026

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

  • వృక్షర్చనలో భాగంగా మొక్కలు నాటిన నాయకులు

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ ) : తెలంగాణ రాష్ట్ర తొలి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదిన వేడుకలను రుద్రంగి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా బిఆర్ యస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షర్చనలో భాగంగా బిఆర్ యస్ పార్టీ నాయకులు మొక్కలు నాటి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ యస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధనకోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోదుడు మాజీ సిఎం కేసిఆర్ అని తెలిపారు. దేశానికి జాతి పిత గాంధీజీ అయితే తెలంగాణా రాష్ట్రానికి జాతిపిత గా కేసిఆర్ నిలుస్తారని అన్నారు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కేసిఆర్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని అన్నారు. మాజీ సిఎం కేసిఆర్ కు మండల బిఆర్ఎస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి,మాజీ ఎంపీపీ గంగం స్వరూప – మహేష్, వైస్ ఎంపీపీ పిసరి చిన్న భూమయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,నాయిని రాజేశం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, మాజీ డైరెక్టర్లు దయ్యాల నారాయణ, తలారి నరసయ్య, మాజీ ఎంపిటి మంచే రాజేశం,మాజీ వార్డు సభ్యులు చెప్యాల గణేష్, ఉప్పులుటి గణేష్, కొడగంటి శ్యాం బిఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News