
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల మరిమడ్ల రోడ్డు ఏర్పాటు ఇక్కడి ప్రాంత ప్రజల ఎన్నో ఏండ్ల చిరకాల కోరిక అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి మానాల ప్రాంత ప్రజల బంధుత్వాలు ఎక్కువగా మరిమడ్ల వైపు ఉండటంతో నేను ఎప్పుడు మానాల వచ్చిన మరిమడ్ల రోడ్ మంజూరు చేయమని ప్రజలు నన్ను అడిగేవారని అన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి నిధులు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప గత సంవత్సర కాలంగా పనులు కొనసాగడం లేదని, తొందరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీలు పిసరీ భూమయ్య, బదనవేణి రాజారాం, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గూగులోత్ శ్యాం సుందర్,నాయకులు జూల భూమయ్య, నరు నాయక్,భూమా నాయక్, రమణ నాయక్, లింబ నాయక్ లు వున్నారు.

