ఘన నివాళి అర్పించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం తన స్వగృహంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు 7 వర్థంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు అనంతరం మండల పరిధిలోని కమ్మపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు 20వేలు రూపాయలు విలువ చేసే దుప్పట్లు, దిండు కవర్లు మెడికల్ ఆఫీసర్ కు అందజేశారు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు, రజనీకాంత్, మాజీ ఎంపిటిసి సురేష్,మధు, మునిరత్నం నాయుడు,బాలసురేష్, పాలడుగు చంద్రశేఖర్ , కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు





