Saturday, March 21, 2026

మహేశ్వరం గడ్డపై శక్తివంతమైన నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • సబితా ఇంద్రారెడ్డి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక దొంగ చాటు వ్యవహారాలు
  • కేసీఆర్ ని ఫ్లెక్సీలలో చూసి తట్టుకోలేకపోతున్న మీరు కేసీఆర్ ని రా చుసుకుందామని అనడం ఆస్యాస్పదంగా ఉంది

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): గత పదేళ్లల్లో ఎన్నడూ లేని విదంగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో బొందపెట్టడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో శక్తివంతమైన నాయకురాలు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ని ఎదుర్కొనే దమ్ము దర్యం లేక దొంగచాటు వ్యవహారాలు చేస్తున్న అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఫ్లెక్సీలను చూసి భయపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని ఎలాగైనా తొలగించాలని పథకం ప్రకారం తుక్కుగుడా మున్సిపాలిటీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు జారిచెశారు. ఆదేశాలు వెలువడిన వెను వెంటనే అత్యుత్సాహంతో ఉద్యోగుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వర్కింగ్ సమయాల్లో ఆఫీసులలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోవడం చేతకాని వీళ్ళు అర్ధరాత్రి 2.00 గంటల సమయంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మొదలుకొని పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరూ కలిసి దొంగల్లా ఇష్టానుసారంగా బ్యానర్లను చింపి, జండాలు పీకి, తోరణాలు లాగేసి చిందరవందరగా చేసి వాటన్నింటినీ మున్సిపాలిటీ వాహనంలో తీసుకెళ్లారు. అయ్యా ఆఫీసర్లు మీరు ఎవ్వరి చేతిలో కీలుబొమ్మలుగా మారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు వచ్చేది మా బీఆర్ఎస్ ప్రభుత్వామే మీకు అర్ధమైందనుకుంటాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News