- చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను సౌందర్యను పరామర్శించిన
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి
- రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు
- చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది
- ఇది అత్యంత దుర్మార్గమైన నీచమైన కార్యక్రమం
- ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసిన ఏ యెజెండ తో చేసిన ఉపేక్షించకూడదు
- దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు
- ఈ దాడికి పాల్పడ్డవారు ఏ ముసుగులో ఉన్న ఈ జెండా పట్టుకున్న వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి
- ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి
- భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
- అర్చకుడు రంగరాజన్‌పై దాడి
- కేటీఆర్ ఏమన్నారంటే…

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్):
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఉదయం అర్చకుడు రంగరాజన్‌ను కేటీఆర్ కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ కుటుంబం సేవ చేస్తోందన్నారు. రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నామని.. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయన్నారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా.. ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చూసుకోవాలన్నారు. అవసరమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. రంగరాజన్‌ను అవమానించడం అంటే దేవుని అవమానించడమే అని అన్నారు. రంగరాజన్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మరోవైపు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రంగరాజన్‌పై దాడి ఘటనలో 17 మంది ఆచూకీని గుర్తించారు పోలీసులు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని ఈరోజు మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పరారీలో ఉన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ నెల 7న వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్ నివాసం ఉంటుంది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్నారు. అలాగే దేవాలయాన్ని తమకు అప్పగించాలని రంగరాజన్‌పై తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.





