Tuesday, March 17, 2026

దుబాయ్ ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి

నేటి సాక్షి ప్రతినిధి, దుబాయ్ ( కోక్కుల వంశీ ) : యూఏఈ దేశం దుబాయి లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని ‘ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం’ ను మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి సోమవారం సందర్శించారు. దౌత్య అధికారులు పబిత్ర కుమార్ మజుందార్, అమ్రీష్ కుమార్, దీపక్ లు రాయబార కార్యాలయం పక్షాన కార్మికులకు అందిస్తున్న సేవలను అనిల్ ఈరవత్రి బృందానికి వివరించారని తెలియజేశారు. ఆయన వెంట నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, ఎస్. వేణు, కటుకం రవి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News