నేటి సాక్షి,బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రామంచ దుర్గయ్య మరియు కత్తి నర్సయ్య గౌడ్ బాధిత కుటుంబాలను మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పరామర్శించి మృతుల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతిని తెలిపి మనో ధైర్యాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మన్, చింతకింది శ్రీనివాస్ గుప్తా, నాయకులు లింగాల బాబు, బొల్లం శ్రీధర్( పెద్దన్న),బండి రమేష్, ఎర్రవెల్లి శ్రీనివాస్, కల్లూరి రవి, బండారి రాములు, కత్తి గంగారాం, కత్తి నర్సయ్య, కత్తి శ్రీనివాస్, జంగిటి శంకర్, బోనగిరి నవీన్, లింగాల శ్రీనివాస్, లింగాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

