- ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాయంలో “బిసి ” నాయకులకు దక్కిన అరుదైన గౌరవం
- వనపర్తి చరిత్రలో ప్రజా పాలనా సభ లో ఓ మరపురాని రోజుగా మిగిలిపోయింది
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తీసుకునే నిర్ణయాల పట్ల నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు మేధావులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. మాజీ శాసనసభ్యులైన “స్వర్గీయ జయరాంయాదవ్ ” పేరుతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం,మాజీ శాసనసభ్యులు స్వర్గీయ “డాక్టర్ బాలకిష్టయ్య” పేరుతో హాస్పిటల్ చేపట్టడం,బిసి లపై ఎమ్మెల్యేకు ఉన్న నిబద్ధతను చాటింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నోట మహనీయుల పేర్లను ప్రకటించడం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.గత పాలకుల హాయంలో వాళ్ల పేరుతో నిర్మాణాలు కట్టుకున్నారే తప్ప ఇలాంటి గొప్ప నాయకుల గురించి ఆలోచించలేదని మేధావి వర్గం ప్రశంసించింది.




