నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర తొలి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో వృక్షార్షన పోస్టర్ ను కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు చేపట్టిన హరిత సేన కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తారీఖున ప్రతి గ్రామంలో మూడు మొక్కలు నాటలని పిలుపునిచ్చారు. హరితహారంతో రాష్ట్రాన్నిమంతటా మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూడాలని ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. ఇప్పుడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, హరిత సేన జిల్లా జిల్లా అధ్యక్షులు బత్తిని కమల్ గౌడ్,పూర్ణ చంద్రర్,కిరణ్ కుమార్, ఏండి రహీమ్, మహేష్, గంగారెడ్డి, వివిధ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





