- యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో…
- అడ్డుకున్న పోలీసులు

నేటిసాక్షి, కోరుట్ల: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి పిలుపుమేరకు ఏఐసీసీ అగ్ర నాయకురాలు వయానాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ భిధురి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రోజున కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోరుట్ల పట్టణ అలాగే మండల యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎంపీ రమేష్ భిధురి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కోరుట్ల పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బిజెపి ఎంపీ రమేష్ భిధురి వాక్యాలను తీవ్రంగా ఖండించారు. బిజెపి పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బేషారత్ గా ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండలం, పట్టణ అధ్యక్షుడు ఇంద్రాల హరీష్, జిల్లా జనరల్ సెక్రటరీ కటుకం చంద్ర శేఖర్, కోరుట్ల నియోజక వర్గ సెక్రెటరీ కడకుంట్ల గంగాధర్, కోరుట్ల పట్టణ, మండల ఉపాధ్యక్షుడు ముక్కెర రాజేష్, కోరుట్ల పట్టణ, మండల కార్యదర్శి కడకుంట్ల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు





