నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ టి.ఎన్ రమేష్
కామారెడ్డి జిల్లాలోని, ఎల్లారెడ్డి మండలంలో గల అడవి లింగాల్ గ్రామ శివారులో, కుచ్చపైన వెలిసిన బ్రహ్మదేవున్ని గురువారం రోజున మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ బ్రహ్మదేవున్ని దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామ శివారులో గల కుచ్చపైన వెలసిన బ్రహ్మదేవున్నీ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, బండ్లు తిప్పుతూ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఆయనతో పాటు అడవి లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, గ్రామ యూత్ అధ్యక్షులు కొరంపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి సామెల్, సొసైటీ డైరెక్టర్ చెన్నంగారి సుఖేందర్ రెడ్డి, భిక్కనూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొక్కొండ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ జీవన్ గౌడ్, రామానంద్, జీవన్ గౌడ్, సాయిలు, నర్సింలు, బాలరాజు, సంతోష్ తదితరులున్నారు.




