నేటి సాక్షి,రామగిరి( కన్నూరి రాజు) :
శుక్రవారం రామగిరి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని సెంటినరీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి మండల బిజెపి అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్షాల మెప్పును పొందిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి, భారతదేశాన్ని ఒక లక్ష్యంతో నడిపించిన ఏకైక మహానుభావుడు అటల్ బీహార్ వాజ్పేయి, అనుబాంబు పరీక్షలు నిర్వహించి భారతదేశం శాస్త్ర పరీక్షకు తక్కువ కాదు అని చెప్పారు మరియు కార్గిల్ యుద్ధంలో ఘన విజయం సాధించి భారత దేశ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అటల్ బీహారీ వాజ్పేయి, బిజెపి రెండు పార్లమెంటు స్థానాలు గెలిస్తే అందులో ఒకటి అటల్ బీహారీ వాజ్పేయి ఇంకోకరు తెలంగాణ ప్రాంతం వరంగల్ నుండి జంగారెడ్డి. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత్వం కలిగి ఉండి గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. దేశాన్ని అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడు వాజ్పేయి వారిని స్మరించుకోవడం నిజంగా కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తీగల శ్రీధర్, బిజెపి సీనియర్ నాయకులు మేరుగు శ్రీకాంత్, కందుల రమేష్, గుజ్జుల రవీందర్ రెడ్డి, ముత్యాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

