
నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే 34 మంది విద్యార్థులకు రూ.16,000 విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేసి గ్రామ మాజీ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, “విద్యార్థుల అవసరాన్ని గుర్తించి వెంటనే స్పందించిన సత్యనారాయణ రెడ్డికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పవన్ సింగ్, పిఎసిఎస్ డైరెక్టర్ అన్నాడి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ కొమిరే మల్లేశం గౌడ్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు కొమిరే శోభ, భామండ్ల లక్ష్మణ్, బొమ్మరవేణి వెంకటేష్, అన్నాడి తిరుపతిరెడ్డి, కల్లేపల్లి తిరుపతి, ఉపాధ్యాయులు సంపత్, మహేందర్ విద్యార్థులు పాల్గొన్నారు.




