- ముందస్తు సమాచారంతో చందుర్తి మండలంలో మాజీ సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి , మంత్రులు నివాస గృహాల ముందు తలపెట్టిన నిరసన దీక్షకు సర్పంచులు తరలి వెళ్తున్నారన్న ముందస్తు సమాచారంతో మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య తో పాటు చందుర్తి మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య మాట్లాడుతూ తమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, తమ హక్కుల కోసం పోరాటం చేస్తే ఇలా పోలీసులచే అరెస్టు చేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.





