నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గం గట్టు మండలం గంగిమన్ దొడ్డి గ్రామానికి చెందిన రాముడు ఈరోజు ఉదయం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. వెంటనే విషయం తెలుసుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ లో ఉన్న ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా, అక్కడే ఉన్న ధరూర్ మండల ఎమ్మార్వోతో మాట్లాడి, బాధిత మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా సాయం అందేలా చూడాలని, తన ఉద్యోగాన్ని తన భార్యకు వచ్చే విధంగా కృషి చేయాలని, ఎమ్మార్వో గారిని కోరారు. వీరి వెంట, శ్రీరాములు, తిరుమలేష్, గంజిపేట రాజు, మునిమౌర్య, ఎండి. మాజ్, నరసింహులు, ఆంజనేయులు, కామేష్ మరియు తదితరులు ఉన్నారు.





