- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం : కార్పొరేటర్ బన్నాల

నేటి సాక్షి – మేడ్చల్ జిల్లా ప్రతినిధి : చిల్కానగర్ డివిజన్ లో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ మాజీ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బ్యాంక్ కాలనీలో సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.కళ్యాణపురి ఇందిరా నగర్ కాలనీలో నూతన బోరు, మోటార్ పనులకు శంకుస్థాపన చేశారు.హైకోర్టు కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు మేజర్ నాలా డిసిల్టింగ్ పనులను ప్రారంభించారు. చిల్కానగర్ గుట్టపై, బ్రహ్మంగారి ఆలయం ఎదురుగా, నార్త్ కళ్యాణ్ పూరీ పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నీ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో అటు బస్తీలలో కాలనీలలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా జరుపుతున్నామని డివిజన్ లో మౌలిక సదుపాయాలు స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్లు, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ లు, సీవరేజ్ లైన్లు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే విధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ప్రతినిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతూ కాలనీలలో బస్తీలలో అధికారులతో కలిసి పర్యటిస్తూ డివిజన్ లోని 80% శాతం పనులను పూర్తి చేశారని అభినందించారు. అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ.. చిల్కానగర్ డివిజన్ లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి నిధుల సేకరణలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ వెన్నెల గౌడ్,ఏ ఈ రాధిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీలోని సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





