నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లోని శివాలయ ప్రాంగణంలో కళ్యాణమండం నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. అర్చకులు శ్రీకాంత్ శర్మ సంకల్పం మేరకు ఆదివారం రోజున స్థలదాతలైన దామెర వంశీయులను మరియు మంటప నిర్మాణ దాత గౌరిశెట్టి జగన్ లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గందె రాధిక శ్రీనివాస్ స్థలదాతలైన దామెర రాము, దామెర హారికృష్ణ, దామెర అనురాగ్, కౌన్సిలర్స్ ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, గాయత్రి బ్రహ్మణ సభ్యులు సురేష్ శర్మ, శ్రీధరాచార్యులు, విశ్వనాథశర్మ, రాకేష్ శర్మ, రాజేశ్ శర్మ, రాజీవీరు అయ్యగారు, రాజేందర్ అయ్యగారు, ఆలయల కమీటి సభ్యులు కోటేశ్వరరావు, యతిపతి అరుణ్, కూమర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

