నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం కోవనూరు పిహెచ్ సి పరిధిలోని గుంటిపేడు, కండ్లూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. కాగా, ఫిబ్రవరి 28న పివి కండ్రిగ, తిమ్మసముద్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ జగదీష్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ పద్మావతి, సర్పంచ్ మురళి, పంచాయతీ కార్యదర్శులు గజేంద్ర, విజయకృష్ణ, స్థానిక నాయకులు సుధాకర్, వాసు, ఎంఎల్ హెచ్ పిలు స్వాతి, మాధవి, ఏఎన్ఎంలు భారతి, విజయనిర్మల, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




