Monday, March 23, 2026

స్విమ్స్ ఆధ్వర్యంలో పూడి, పెద్దకనపర్తిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

  • ఫిబ్రవరి 25 నుండి కోవనూరులో పిహెచ్ సి పరిధిలో

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో సోమవారం కాసరం పిహెచ్ సి పరిధిలోని పూడిలో గల జడ్పీ ఉన్నత పాఠశాల,పెద్దకనపర్తిలో గల విహెచ్సిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

ఫిబ్రవరి 25 నుండి కోవనూరులో క్యాన్సర్ స్క్రీనింగ్
ఫిబ్రవరి 25న అంజూరు, పెరిందేశం
ఫిబ్రవరి 27న కాండ్లూరు, సూరమాల
ఫిబ్రవరి 28న పివి కండ్రిగ, తిమ్మసముద్రం

ఈ కార్యక్రమాల్లో తొట్టంబేడు ఎంపిడిఓ పి.సురేంద్రనాథ్, జడ్పీటీసీ పి.మునిరత్నం, పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ మాధవుడు, డాక్టర్ శివకుమార్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య భాను, డాక్టర్ హరిత, సర్పంచులు పి.మునెమ్మ, జి. విమల, పంచాయతీ కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, నవీన్, ఎంపిహెచ్ఈఓ బాషా, పిహెచ్ఎన్ గౌరి, సూపర్వైజర్ ఎన్. అమ్మణ్ణమ్మ, ఎంఎల్ హెచ్ పిలు పి. తేజ, కె. దివ్య, ఏఎన్ఎంలు పి.దేవి, వై. సురేఖ, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News