నేటిసాక్షి, ఎండపల్లి : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామపంచాయతీ ఆవరణలో వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి సౌజన్యంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ రాజారాంపల్లి మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 95 మంది పరీక్షలు చేసుకోగా,55 మందికి శిబిరంలోనే రోగానికి తగిన మందులు పంపిణీ చేశారు. కాగా 45 మందికి కంటి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఐదుగురు రోగులు శస్త్ర చికిత్సకు వెళ్లలేదు. మిగిలిన 40 మంది ని ఉచిత కంటి శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రి బస్సు ద్వారా తరలించారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ చింతల ప్రభాకర్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఏఎన్ఎం లు కే. బుచ్చమ్మ, చంద్రకళ, ఆశా వర్కర్ లు జాడి లక్ష్మి, గుమ్మడి విజయ, లయన్స్ క్లబ్ ఆఫ్ రాజారాంపల్లి అధ్యక్ష, కార్యదర్శులు దుంపెటి తిరుపతి, తుమ్మల రమణారెడ్డి, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ సామ ఎల్లారెడ్డి, కుంట మల్లారెడ్డి, గడ్డం నంది రెడ్డి, కే. సత్యనారాయణ రావు లతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుండాటి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





