ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చే ప్రారంభం
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కందుగుల గ్రామంలో జయన్న ఫౌండేషన్ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బల్మురి మాట్లాడుతూ హుజు రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ తో కలిసి జిల్లా మంత్రులను సహకారంతో అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జైన ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కంటి చూపు ప్రసాదిస్తున్న జయన్న ఫౌండేషన్కు ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.