నేటి సాక్షి
గోదావరిఖని (రమేష్)
రామగుండం నియోజవర్గం లో గోదావరిఖని ఊర్వశీ థియేటర్ లో ఉచితంగా “చావా” చిత్ర ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు ముందుగా గోదావరిఖని చౌరస్తా నుండి ఊర్వశీ థియేటర్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ర్యాలీ అనంతరం థియేటర్లో “చావా” చిత్రాన్ని బిజెపి రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ… సినిమా ద్వారా యువతకు ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగేలా స్పూర్తిని అందించడమే లక్ష్యమని తెలిపారు. చత్రపతి శివాజీ మహారాజ్ జీవితం మనకు అనేక విధాలుగా స్ఫూర్తినిచ్చే గొప్ప ఉదాహరణ అన్నారు. ధైర్యం, చాకచక్యం, రాజనీతులు, ప్రజాభిమానాన్ని పొందిన తీరు అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి అన్నారు. శివాజీ స్ఫూర్తిగా ముందుకు సాగాలంటే ఈ చిత్రం ద్వారా జీవిత చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు… సందర్భంగా కందుల సంధ్యారాణి. ఉచిత ప్రదర్శనను విజయవంతం చేసిన థియేటర్ యాజమాన్యానికి, సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ ,తోట కుమారస్వామి, మండల అధ్యక్షులు కోడూరి రమేష్ , తడగొండ నర్సయ్య, సిలువేరు అంజి,భాస్కర్, అందే రాజ్ కుమార్ చారి,బండారి శ్యామ్ కుమార్,పంగ రవి,మామిడి వీరేశం,జక్కుల ప్రవీణ్,జక్కన బాలు,పద్మ,అపర్ణ,పంగరవి,జనగామ శివరాం,మెరుగు శ్రీనివాస్,తిరుపతి,బుంగ మహేష్ ,తదితరులు పాల్గొన్నారు….





