Saturday, March 14, 2026

ప్రజలకు ఉచిత వైద్య సేవలు

  • ప్రతి ఒక్కరు ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
  • ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి ) :
పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ కొంతం శ్రీనివాస్ రెడ్డి స్మారకార్ధం పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి కొంతం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు శివకృష్ణ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరన్ని ప్రారంభించిన అనంతరం మున్సిపల్ కార్మికులకు దగ్గర ఉండి పరీక్షలు చేపించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ముందుగా ఎమ్మెల్యే ని వైద్య బృందం, పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. కొంతం శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు వార్డ్ మెంబర్ గా రెండు సార్లు కౌన్సిలర్ గా దరిదాపు 19 సంవత్సరాలు వారు వార్డు ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తను లేని లోటు ప్రతి ఒక్కరికి బాధాకరమని కొంతం శ్రీనివాస్ రెడ్డి నాతో మంచి సంబంధం కలిగినటువంటి వ్యక్తి అని వారు నిత్యం పేద ప్రజలకు సేవ చేయాలనే పరితపించేవారని మున్సిపల్ సిబ్బందితో కూడా మంచి సంబంధాలు కొనసాగించారని వారి స్మారకార్ధం చక్కటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. కొంతం శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన నేను తప్పకుండా హాజరవుతానని అన్నారు వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని అలాగే భగవంతుడు వారికి మనోధైర్యం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, షాహీధ సబీర్ ఖాన్, పైడ రవిపద్మ, మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, ఓదెల మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి, బైరి రవి, డిల్లీ శంకర్, మల్లయ్య, చందు, శంకర్, రామ కృష్ణ, సంతోష్, నరేష్, సుధన్, స్వామి, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్,డా,,మహేశ్వర్ రెడ్డి,కొంతం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News