Wednesday, April 1, 2026

డాక్టర్ జిల్లెల్ల మాధవ రెడ్డి జ్ఞాపకార్థం ఉచిత మెగా శిబిరం…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి నియోజకవర్గ ప్రజలకు మరియు గోపాల్ పేట మండలం పరిసర ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత వాసి, ప్రముఖ వైద్యుడు డా. జిల్లెల మాధవ రెడ్డి జ్ఞాపకార్థం, వారు వైద్య వృత్తిలో చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపిసి వైద్య విభాగం ) ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోపాల్ పేట మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని గోపాల్ పేట మండల పరిసర ప్రాంత ప్రజలు, మరియు వనపర్తి నియోజకవర్గ ప్రజలు వినియో గించుకుని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.డాక్టర్ జిల్లెల్ల మాధవ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా శిబిరానికి వివిధ వైద్య విభాగాలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖ వైద్యులు హాజరవుతారు. అదేవిధంగా ఈ ఉచిత వైద్యం మెగా శిబిరం నందు దాదాపు 14 వైద్య విభాగాలకు చెందిన చెవు, ముక్కు సంబంధిత సమస్యలకు, గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్,చర్మ సంబంధిత వ్యాధులకు, గుండె సంబంధిత వ్యాధులకు, కంటి వైద్య పరీక్షలకు, జనరల్, ఫిజీషియన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, కీళ్ల నొప్పులు, ఓబీజీ, గైనకాలజీ, రోగాలకు చికిత్స చేయబడును. ఈ ఉచిత మెగా శిబిరాన్ని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డా. జిల్లైల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు. డా. జిల్లెల ఆదిత్య రెడ్డి నెషనల్ హెడ్ – ఏఐపీసీ మెడికల్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News