Friday, March 27, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఉచిత మెగా వైద్య శిభిరం

  • ఉచిత మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు కుటుంబ సభ్యులకు, మహిళా పోలీస్ సిబ్బందికి, మహిళా పోలీసులు, బి.సి హాస్టల్ విధ్యార్తినీలకు క్యాన్సర్ పై అవగాహనక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, వైద్య శిబిరాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, ప్రత్యేకంగా వారం రోజులపాటు మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వహించగలరని అన్నారు. సుమారు 254 మందికి పరీక్ష నిర్వహించడం జరిగింది. వీళ్లు మహిళా ప్రాంగణం, సెట్విన్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ ఓరల్ క్యావిటి, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఆత్రోపెడిక్, గైనకాలజీ మొదల విభాగాల నుంచి నిష్ణాతులైన డాక్టర్లు పరీక్షలు నిర్వహించినారు. స్విమ్స్ ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, వాసన్ ఐ కేర్, ఆస్టర్ నారాయణద్రి, శ్రీకర్ హాస్పిటల్ డాక్టర్లు టెస్ట్ లను పోలీస్ శాఖ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అవసరమైన అన్ని రకాల ప్రాథమిక పరీక్షలను చేసి ఫలితాల అనంతరం వారికి తగు చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. సాధారణంగా చాలామంది ఆడవాళ్లు తమ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా తన భర్త, పిల్లలే ప్రపంచంగా భావిస్తూ, తమ ఆరోగ్య సమస్యలను కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచి పెడుతూ మౌనంగా ఉండిపోతారు, అలా ఉండిపోవడం వలన చిన్నచిన్న ఆరోగ్య సమస్య కాస్త పెద్దదిగా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆరోగ్య సమస్యలు కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఏర్పడుతుందన్నారు. అలా జరగకుండా నివారించడానికి ఈ వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించి అన్ని రకాల వైద్య పరీక్షలను చేయించి అవసరమైన వైద్యాన్ని కూడా అందించి మన పోలీస్ శాఖ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ఈ మెడికల్ క్యాంపు ల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ అవకాశాన్ని పోలీస్ శాఖ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవడం తనకు చాలా సంతోషదాయకంగా ఉందన్నారు. అలాగే పోలీస్ శాఖా తరపున ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా ఎస్పి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. మాదూరి పోలీస్ యూనిట్ డాక్టర్, డా. హర్షిత, డా. చైతన్య భాను, డా. మౌనిశ, డా. కృష్ణ కుమార్, డాక్టర్ లక్ష్మీ ప్రియా, శ్రీ శ్రీనివాస రావు అదనపు ఎస్పీ ఏ.ఆర్, చంద్ర శేఖర్ డి.ఎస్.పి ఏ.ఆర్, తమీం అహ్మద్ సి.ఐ, రమనా రెడ్డి ఆర్.ఐ వెల్ఫేర్, శివాజీ ఎస్.ఐ, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News