- జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే నిరుద్యోగ యువతకు ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందించడం కొరకు అభ్యర్థుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-1, 2, 3, 4, కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు అనుభవజ్ఞులైన శిక్షకులతో 4 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందించడం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సికులు) తమ దరఖాస్తు తో అవసరమైన ధృవపత్రాలు జతపరిచి ఫిబ్రవరి 15వ తేదీలోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మొదటి అంతస్తు ఎఫ్-5 లో గల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో పని వేళల యందు అందించాలని తెలిపారు. ఇతర వివరాలకు 9705912145 నంబర్ లో సంప్రదించవచ్చని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.





