- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
- అదనపు కలెక్టర్ సంచిత్ గగ్వార్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో “జన మైత్రి” పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ఎస్పి రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభం చేశారు. శాంతికి సూచకంగా పావురాలను బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం టాస్ వేసి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి, కొద్దిసేపు క్రికెట్ బాటింగ్, వాలీబాల్ ను ఎంతో సంతోషంగా ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్యలో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరిచేందుకు క్రీడలు ఉయోగపడతాయన్నారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తాయన్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయని, ఎస్పీ కార్యాలయ మైదానంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో పాల్గొనాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులంటే ప్రజలు భయం వీడాలని, సాధారణ ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని, ప్రజల్లో భయం పోగొట్టేందుకే ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా నేరాల కట్టడిలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్రునారు. ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరా రెడ్డి, డిఎస్పీ లు వెంకటేశ్వరా రావ్, ఉమా మహేశ్వర రావ్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, పోలీసులు, ఇతర అధికారులు తదితరులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.

