- శ్రీ నందవరం చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి విరాళం అందజేత
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని వలబ్ నగర్ కాలనీ లో ఉన్న శ్రీ నందవరం చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి 32000 వేల రూపాయలు చేయూత నిచ్చిన స్నేహితులు దాడి చంద్రశేఖర్ రెడ్డి ఓమేష్ రెడ్డి వనపర్తి పట్టణానికి చెందిన స్నేహితులు వృద్ధ ఆశ్రమనిర్వాకుడికి రాము కు విరాళం అందజేశారు ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విరాళం అందజేశామని అన్నారు మానవ సేవే మాధవ సేవ అని పేర్కొన్నారు. నిస్వార్థ సేవలతోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయన్నారు. మానవతా దృక్పథంతో సేవలు చేసినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుందన్నారు. అనాథ వృద్ధులకు పట్టణంలో ఉన్న ప్రముఖులు విరాళాలు అందజేయడం హర్షణీయమన్నారు. నిస్వార్థంగా అనాథ వృద్ధులను అకున చేర్చుకొని సేవలందిస్తున్న రాము కుటుంబసభ్యులను ప్రత్యేకంగా అభినందించారు

