- సముద్రాల రమేష్ గుప్తా
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థుతం కొనసాగుతున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత పాలకులు నిరుపేద ఆర్యవైశ్యులను పట్టించుకోలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేద ఆర్యవైశ్యుల సమస్యలను గుర్తించి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా చైర్మన్ గా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కాల్వ సుజాతక్కను నియమించడం అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. దీనికి యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుపేద ఆర్యవైశ్యులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ కు రుణపడి ఉంటామన్నారు. అలాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఆదుకోవాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో నిరుపేద ఆర్యవైశ్య యువకులకు ప్రాధాన్యత కల్పించి, రుణ సాయం అందించాలని రమేష్ గుప్తా కోరారు.





