- హుజురాబాద్ ప్రాజెక్టు సిడిపిఓ సుగుణ ఉత్తర్వులు జారీ
నేటి సాక్షి, వీణవంక: హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వీణవంక మండలంలో వీణవంక, చల్లూరు సెక్టార్ ఉండగా, గత ఆరునెలల క్రితం చల్లూరు సెక్టార్ సూపర్వైజర్ శశి కిరణ్మయి బదిలీ అయ్యారు. వీణవంక సూపర్వైజర్ వీణవంక, చల్లూరు సెక్టార్లకు ఇన్చార్జిగా కొనసాగుతుండగా, కొన్ని అనివార్య కారణాలతో హుటాహుటిన సోమవారం వసంత పంచమి పర్వదినాన వీణవంక సెక్టార్ కు నూతన సూపర్వైజర్ గా జి రమాదేవిని నియమిస్తూ, హుజురాబాద్ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా విచ్చేసిన వీణవంక సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జి రమాదేవి కి, అంగన్వాడి టీచర్లు, అంగన్వాడి ఆయాలు పలువురు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు.





