Tuesday, March 10, 2026

గద్దర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ

  • కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షునీగా వనతడుపుల అంజయ్య

నేటిసాక్షి, కోరుట్ల: ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ప్రతిష్ట కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గజ్జల స్వామి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్లూరు గ్రామానికి చెందిన వనతడుపుల అంజయ్యను కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గజ్జల స్వామి తెలిపారు. త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో కమిటీలు వేస్తామని, ఈ జనవరి 31న కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో గద్దర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎంపికైనా అంజయ్య మాట్లాడుతూ…తనపై విశ్వాసం ఉంచి కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని తన బాధ్యతలను. సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News