- మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు
సైదాపూర్, నేటి సాక్షి:
మలిదశ ఉద్యమకారుడు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త బొడిగ గాలన్న సేవలు మరువలేనివని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే విడతల సతీష్ బాబు అన్నారు. సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఆదివారము గాలన్న ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ బాబు హాజరై గాలన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో గాలన్న చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో: భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.