- ఆవిష్కరించిన జమ్మికుంట పట్టణ సీఐ వరంగంటి రవి
నేటి సాక్షి, జమ్మికుంట:
ఉన్న ఊరే కన్నతల్లి లాంటిదని భావించి గండ్రపల్లి ఊరు పేరు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న గండ్రపల్లి సేవ ఫౌండేషన్ విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరు వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గండ్ర పల్లి సేవా ఫౌండేషన్ క్యాలెండర్ ను జమ్మికుంట పట్టణ సీఐ వరంగంటి రవి చేతుల మీదగా ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం గండ్రపల్లి సేవ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలిచిన గండ్రపల్లి సేవ ఫౌండేషన్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. కలిసిన సంవత్సరలలాగానే ఈ సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తితో పని చేస్తామని ఆకలి అన్నవారికి అన్నం పెట్టడమే గండ్ర పల్లి సేవా ఫౌండేషన్ ఉద్దేశం అని ఇప్పటికే గండ్ర పల్లి సేవ ఫౌండేషన్కు పుల్లయ్య అచ్యుతరావు శాశ్వత ఫౌండేషన్ గా ఉండడం జరిగిందనీ, ఇంకొంతమంది దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గండ్రపల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలోగాదె ప్రభాకర్ పటేల్ ప్రధాన కార్యదర్శి ఓర్సు ప్రవీణ్ కుమార్ గాదె కుమార్ పటేల్ దినేష్ పటేల్ ప్రవీణ్ లు పాల్గొన్నారు.

