నేటి సాక్షి, జమ్మికుంట : నినాదం పత్రిక హుజురాబాద్ RC అయిత రాధా కృష్ణ ,తల్లి అయిత రాజ్యలక్ష్మి ఈరోజు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణా రెడ్డి పరామర్శించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అయిత రాజ్యలక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, బిజెపి జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్, హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కొండాల్ రెడ్డి తదతరులు వున్నారు.





