నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండలకేంద్రం జిల్లా పరిషత్ పాఠశాల గన్నేరువరం కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తి వైశాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఈ.ఎల్.టి.ఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇంగ్లీష్ ఎలక్యూషన్ పోటీలో ప్రతిమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఎంపిక కాబడిన విద్యార్థిని గ్రైడ్ టీచర్ కె. సుప్రియ (స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్)ని ప్రధానోపాధ్యాయులు కే. రామయ్య అభినందించారు. వీరు సాధించిన విజయం పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.





