Thursday, March 19, 2026

మద్యం బాటిల్ లో చెత్త చెదారం

నిర్లక్ష్యంగా వైన్స్ యజమాని సమాధానం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో మందాకిని దుర్గా వైన్స్ లో ఓ విక్రయదారుడు మద్యాన్ని కొనుగోలు చేయగా అందులో చెత్తాచెదారం కనబడింది. ఇదేమిటని సదరు వినియోగదారుడు షాపు యజమానిని అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. వరంగల్ రోడ్ లోని మందాకిని దుర్గా వైన్స్ లో ఓ యువకుడు మద్యాన్ని కొనుగోలు చేయగా అందులో చెత్తాచెదారం ఉండడం లీక్ కావడం గమనించి షాపు యజమానిని ప్రశ్నించగా నాకు ఎలాంటి సంబంధం లేదని ఎవరితో చెప్పుకున్న పర్వాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వినియోగదారుడు వీడియో తీస్తుంటే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్సైజ్ అధికారులు స్పందించి మద్యం వినియోగదారుల కు నాణ్యమైన మద్యాన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News